గతకొంతకాలంగా ద్విచక్ర వాహనాలు, దేవాలయాల్లో చోరీకి పాల్పడుతున్న ఒంగోలుకు చెందిన నేరస్తులను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వారిని సెంట్రల్ క్రైమ్ స్టేషన్కు తరలించగా.. తాజాగా ఇద్దరు నేరస్తులు ఆజాద్, నాగుల్ మీరా స్టేషన్ నుంచి పరారయ్యారు. గంజాయి కేసుల్లోనూ వీరికి ప్రమేయం ఉండడంతో వీరిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు కళ్లుగప్పి తప్పించుకున్న నేరస్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.