కేరళలో ఓ జంట గూగుల్ మ్యాప్స్‌ను అనుసరించి కారుతో వరద నీటిలో చిక్కుకుంది. భారీ వర్షాల కారణంగా కొట్టాయంలోని కడుతురుతిలో రోడ్లు వరద నీటితో నిండిపోయాయి. ఇదే సమయంలో జోసెఫ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి కారులో వెళ్లారు. మ్యాప్ చూపిన దారిలో వెళ్తుండగా ఒక చోట వరద నీటిలో చిక్కుకుపోయారు. కారు ముందు భాగం మొత్తం నీటిలో మునిగింది. గమనించిన స్థానికులు అందులోని దంపతులను రక్షించారు. అనంతరం కారును నీటి నుంచి బయటకు తీశారు.