పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మి ఆదేశాల మేరకు ఆచంట మండల వ్యాప్తంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పలు గ్రామాల్లో తెల్లవారుజాము నుంచి పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన దాడులు, ద్విచక్రవాహనాల దొంగతనాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. సరైన పత్రాలు లేని ద్విచ్రక వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలోకి కొత్త వ్యక్తులు వస్తే వారిపై అనుమానం ఉంటే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు.