రన్నింగ్ ట్రైయిన్ నుంచి దిగే ప్రయత్నంలో రైలు కింద పడే వ్యక్తిని ఓ కానిస్టేబుల్ రక్షించాడు. ఈ ఘటన హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. కాచిగూడ రైల్వేస్టేషన్ లో దిలీప్ అనే రన్నింగ్ ట్రైన్ నుంచి దిగే ప్రయత్నం చేశాడు. దీంతో ప్రమాదవశాత్తు జారిపడి రైలు కింద పడిపోతున్న క్రమంలో అక్కడే ఉన్న కానిస్టేబుల్ శర్మ ఆ ప్రయాణికుడిని బయటకు లాగాడు. చాకచక్యం వహించిన కానిస్టేబుల్ ను దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు అభినందించారు.