అందరూ ఊహించినట్లుగానే జూబ్లీహిల్స్‌లో వార్ వన్‌సైడ్ అయ్యింది.. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ చెప్పినదాని కంటే ఎక్కువ ఓట్ల మెజార్టీతో గెలుపొందారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. తన ప్రత్యర్థి.. బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు మాగంటి సునీతపై 24,729 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొదలు.. ప్రతి దశలోనూ నవీన్ యాదవ్ లీడ్‌లో నిలుస్తూ వచ్చారు. ఏ దశలోనూ ప్రత్యర్థులు నవీన్‌ను చేరింది లేదు. ఫలితంగా 10 రౌండ్లలో 24 వేల పైచిలుకు ఓట్లతో జూబ్లీహిల్స్ గడ్డపై జయకేతనం ఎగురవేశారు నవీన్ యాదవ్.