సంకల్పం, అభ్యుదయం పేరుతో డ్రగ్స్ నిర్మూలన కోరుతూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పాయకరావుపేట నుండి ఇచ్చాపురం వరకు చేపట్టిన సైకిల్ ర్యాలీ అనకాపల్లి చేరింది. అనకాపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిఐజి గోపీనాథ్ జెట్టి, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, జిల్లా కలెక్టర్ కే విజయ్ కృష్ణన్, స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సైకిల్ తొక్కి ర్యాలీలో పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ నుంచి అనకాపల్లి నెహ్రూ చౌక్ జంక్షన్ వరకు సైకిల్ తొక్కి యువతలో ఉత్సాహం నింపారు.