ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రిలో కొలువైన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారిని త్రిదండి చిన్నజీయర్ స్వామి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం జ్వాలా నరసింహస్వామి వారి కొండపై కోటి 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఘాట్ రోడ్డు ఆర్చిని స్వామీజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులకు అనుగ్రహ భాషణం చేస్తూ.. కృష్ణా నది తీరాన కొండల మధ్య వెలసిన ఈ క్షేత్రం అత్యంత సౌందర్యవంతమైనదని కొనియాడారు. ఆలయ పురాతన వైభవాన్ని కాపాడుతూ భావితరాలకు అందించాలని కోరారు.