నంద్యాల జిల్లా మిట్టకందాల అంగన్వాడీ కేంద్రంలోపాలు తాగిన 9 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. చిన్నారులు పాలు తాగిన కాసేపటికి వాంతులు, విరోచనాలు చేసుకున్నారు. దీంతో చిన్నారులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే చిన్నారులు అస్వస్థతకు గురవడానికి కారణం ఆహారమా లేక పాలా అనేది ఇంకా చెప్పలేమని.. ప్రస్తుతం విద్యార్ధుల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్ తెలిపారు.