సంగారెడ్డి జిల్లాలోని రుద్రారం గ్రామంలో 65వ నెంబర్ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ప్యాలెస్ హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వారం రోజుల క్రితం జరిగిన తనిఖీల్లో, హోటల్ కిచెన్‌లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో అధికారులు వారి ఫుడ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రమాణాలను మెరుగుపరచడానికి హోటల్ యాజమాన్యానికి అధికారులు గడువు ఇచ్చారు. దీంతో, శుక్రవారం సంగారెడ్డి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారిణి అమృత తన సిబ్బందితో కలిసి ఈ పునఃపరిశీలన తనిఖీలు చేపట్టారు. హోటల్ సిబ్బందికి ఏమేమి నాణ్యత ప్రమాణాలు పాటించాలో ఆమె సూచనలు చేశారు.