అనంతపురంలోని కొవ్వూరు నగర్లో చైన్ స్నాచర్లు మళ్లీ రెచ్చిపోయారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా గుడికి వెళ్లి తిరిగి వస్తున్న మాధవిలత అనే మహిళ మెడలోని బంగారు గొలుసును బైక్పై వచ్చిన దుండగులు లాక్కెళ్లారు. ఈ క్రమంలో దుండగులు బలంగా గొలుసు లాగడంతో బాధితురాలు రోడ్డుపై పడిపోయింది. అనంతరం ఆ దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ చైన్ స్నాచింగ్ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.