చట్టం, శాంతిభద్రతలు కాపాడే దిశగా హైదరాబాద్లోని చాదర్ఘాట్ పోలీసుల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చాదర్ఘాట్, ఆజంపురా, వాహెద్ నగర్, ఓల్డ్ మలక్పేట్, కమల్ నగర్, మూసానగర్ ప్రాంతాల్లోని హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అధికారుల ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ తనిఖీల్లో నిషేధిత వస్తువులు, ఆయుధాలు, అనుమానాస్పద కార్యకలాపాలు ఉన్నాయా అనే అంశాలను పరిశీలించారు. ఇక వాహనాల తనిఖీలు చేపట్టి.. డాక్యుమెంట్లు, నెంబర్ ప్లేట్లు, ట్రాఫిక్ ఉల్లంఘనలు పరిశీలించారు.