ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆకివీడుకు చెందిన ఓ భక్తుడు ద్వారకాతిరుమల వచ్చి మొక్కుబడులు తీర్చుకుని తిరుగు ప్రయాణమైన సమయంలో.. ఎదురుగా ఓ బైక్ అడ్డొచ్చింది. దీంతో బైక్ను తప్పించబోయి కారు వేగంగా డివైడర్ను ఢీకొట్టడంతో బోల్తా పడింది. అయితే కారులో ఉన్న వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు. నిత్యం రద్దీగా ఉండే ద్వారాకాతిరుమల రహదారిపై ప్రమాదం జరిగే సమయంలో ఇతర వాహనాలు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.