మహారాష్ట్రలోని థానేలో గల బర్నాథ్ వంతెనపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో వేగంగా వచ్చిన కారు నియంత్రణ కోల్పోయి పలు ద్విచక్ర వాహనాలను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో దాదాపు ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, నలుగురైదుగురు గాయపడ్డారు. ప్రమాదం తర్వాత భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.