హైదరాబాద్ జూబ్లీహిల్స్లో అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. అతివేగం తో విద్యుత్ స్థంభం ను ఢీకొని అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో కారులోని డ్రైవింగ్ సీట్లోనే యువతి ఇరుక్కుపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన పోలీసులు.. అద్దాలు పగులగొట్టి యువతిని కాపాడారు. ఎయిర్బ్యాగ్స్ ఓపెన్ కావడంతో యువతి స్వల్ప గాయాలతో బయటపడింది. అయితే గాయపడిన యువతిని పోలీసులు మెడికోగా గుర్తించారు.