పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు చిత్రవిచిత్ర హామీలతో ఓటర్ల మదిని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం బొప్పాపూర్ గ్రామ సర్పంచి అభ్యర్థి భాను ప్రసాద్.. గ్రామంలో వీధి కుక్కలు గ్రామస్తులపై దాడిచేసి గాయపరుస్తున్నాయని తెలిపారు. అందుకే గ్రామ సర్పంచ్‌గా తనను గెలిపిస్తే గ్రామంలో కోతులు, కుక్కల బెడద లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. కుక్కలను గ్రామం నుండి జంతు సంరక్షణ కేంద్రానికి తరలించి గ్రామంలో కుక్కల బెడద లేకుండా చూస్తానని తెలిపారు.