ఎన్టీఆర్ జిల్లా నందిగామ అనాసాగరం ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు.. మహారాష్ట్ర నుంచి షుగర్ లోడ్‌తో అమలాపురం వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మందికి గాయాలుకాగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం సమయంలో బస్సులో 35 మంది ప్రయాణిస్తున్నారు. గాయపడిన వారిని నందిగామ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.