తమిళనాడులోని రామేశ్వరంలో 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించిందన్న కారణంతో ఒక వ్యక్తి దారుణంగా కత్తి దాడి చేసి హతమార్చాడు. సేరంగొట్టైకు చెందిన షాలినీ.. జిల్లా ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. గత కొన్ని రోజులుగా మునియరాజ్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో వెంటాడుతున్నాడు,.. ఆమె పలుమార్లు హెచ్చరించినా, అతను వేధింపులు కొనసాగించాడు. వేధింపులు భరించలేక షాలినీ తండ్రి మరియప్పన్కు చెప్పడంతో మునియరాజ్ను హెచ్చరించాడు. దీంతో షాలినీపై కక్ష పెంచుకున్న మునియరాజ్ కత్తితో దాడి చేసి హతమార్చాడు. మునియరాజ్ను పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.