ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ చేపట్టిన ఎంపీ ఇల్లు ముట్టడి ఉద్రిక్తత కు దారి తీసింది. పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్థానిక ఎంపీ నగేష్ ఇల్లుముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. భారీ సంఖ్యలో ఎంపీ నగేష్ ఇల్లు ఇంటి ముందు బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళన కారులను అరెస్టు చేస్తుండగా తోపులాట జరిగింది. పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి.