తమ్ముడును కాపాడబోయి అన్న మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. చిన్న మండవ గ్రామానికి చెందిన కాసిమల్ల నాగ గోపి(23), నందకిశోర్ (19) అన్నదమ్ముళ్లు. సాయంత్రం గ్రామ సమీపంలోని మున్నేరులో బైక్ కడిగేందుకు వెళ్లగా తమ్ముడు నందకిషోర్ అదుపుతప్పి నీటిలో పడిపోయాడు. తమ్ముడిని కాపాడేందుకు అన్న నీటిలోకి దూకగా నీటి ప్రవాహానికి ఇద్దరు గల్లంతయ్యారు. గాలించి మృతదేహాలను బయటకు తీశారు.