కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం పాములపాడు గ్రామంలో వంతెన కూలిపోయింది. దీంతో దోసపాడు కాలువలో టిప్పర్‌లారీ పడిపోయింది. అధిక లోడ్‌తో లారీ రావడంతోనే వంతెన కూలిపోయిందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదం నుంచి టిప్పర్ డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. వంతెన కూలిపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.