నిజామాబాద్ జిల్లా మంగల్ పహాడ్లో విషాదం చోటుచేసుకుంది. రెండు రోజుల్లో పెళ్లి ఉండగా వరుడు ప్రతాప్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో గొడవ జరగడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ప్రతాప్ గౌడ్ టానా కలాన్ గుట్ట ప్రాంతంలో.. మద్యం సేవించి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలిస్తుండగా.. గుట్ట ప్రాంతంలో బైక్ కనిపించింది. దీంతో అక్కడికి వెళ్లి చూడగా ఆత్మహత్య చేసుకున్నాడు.