భద్రాద్రి కొత్తగూడెం రైల్వే స్టేషన్లో బాంబు కలకలం రేపింది. ఉదయం రైల్వేస్టేషన్ మొదటి ప్లాట్ ఫారంపై గుర్తు తెలియని వ్యక్తులు నల్ల సంచిలో బాంబు పెట్టి వెళ్లిపోయారు. ట్రాక్‌పై ఉన్న ఆ బాంబును వీధి కుక్క కొరకడంతో.. అది ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో ఆ కుక్క అక్కడికక్కడే మృతి చెందింది. రైల్వే స్టేషన్లో పేలుడు శబ్దం రావడంతో భయపడ్డ ప్రయాణికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్న డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు.