అనంతపురంలోని సాయినగర్ 1 క్రాస్‌లో ఉన్న జనరేటర్ లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. భారతి ప్రైవేటు ఆసుపత్రి దగ్గర ఉదయం తీవ్ర దుర్వాసన రావడంతో ఆస్పత్రి సిబ్బంది జనరేటర్ లో పరిశీలించారు. జనరేటర్ తెరచి చూడగా అందులో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు గమనించారు. దీంతో రెండో పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆయా ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ప్రమాదవశాత్తు మరణించాడు లేక ఎవరైనా హత్య చేసి జనరేటర్ లో ఉంచారా అని కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.