నారాయణ పేట జిల్లా మక్తల్ మండలం కాచ్వార్ గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో గెలవడం కోసం ఏకంగా క్షుద్ర పూజలు చేయడం సంచలనంగా మారింది. సర్పంచ్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న వెంకటమ్మ ఇంటి ఎదురుగా కొంతమంది ఈ క్షుద్రపూజలు చేసినట్టు సీసీ కెమెరాలో రికార్డైంది. దీంతో గ్రామంలో ఒక్కసారిగా అలజడి రేగింది. క్షుద్రపూజలకు సంబంధించిన వస్తువులను వెంకటమ్మ ఇంటి ముందు. అలానే గ్రామ పంచాయతీ కార్యాలయం, పలు వీధుల్లో పెట్టి వెళ్లిపోయారు.