శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తి మండలం పెడబల్లి గ్రామ సమీపంలో గోవధను అయ్యప్ప మాల ధరించిన బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. గత కొంతకాలంగా గ్రామం పక్కన షెడ్డు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున గోమాంసాన్ని పట్టణ ప్రాంతాలకు, చిక్-కబాబ్ సెంటర్లకు తరలిస్తున్నారని సమాచారం. పుట్టపర్తి మండలంలో నిరాటంకంగా కొనసాగుతున్న ఈ అక్రమ గోవధను అయ్యప్ప స్వాములు అడ్డుకుని, తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గతంలో హెచ్చరించినా పట్టించుకోకుండా హిందూ సంప్రదాయాలకు విరుద్ధంగా గోమాతలను కోయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి, అక్రమ గోవధకు పాల్పడుతున్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అయ్యప్ప స్వాములు, స్థానికులు డిమాండ్ చేశారు.