మంచిర్యాల జిల్లా కిష్టంపేట వై జంక్షన్ సమీపంలోని ఫారెస్ట్ టోల్ గేట్ దగ్గర వేగంగా దూసుకొచ్చిన బైక్.. టోల్‌గేట్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టోల్ గేట్ స్వల్పంగా ధ్వంసం కాగా.. బైక్ పై ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. మితిమీరిన వేగం వల్లనే ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.