ప్రకాశం జిల్లా, పామూరు మండలం రావిగుంటపల్లి టోల్ ప్లాజా దగ్గర పెను ప్రమాదం జరిగింది. ఒక కంటైనర్ లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. పామూరు నుంచి కనిగిరి వెళ్తున్న ఆర్టీసీ బస్సును, ఎదురుగా వస్తున్న లారీ గుద్దడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో 9 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే మినీ లారీ డ్రైవర్‌కు మాత్రం తీవ్ర గాయాలు అయ్యాయి. ఒక్కసారిగా ప్రమాదం జరగడంతో బస్సులోని ప్రయాణికులు చాలా భయపడ్డారు. అదృష్టవశాత్తూ, అందరూ సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది