పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మున్సిపాలిటీకి ప్రతిష్టాత్మక ఏపీ ఎనర్జీ కన్జర్వేన్సీ అవార్డు 2025 లభించింది. భీమవరం మున్సిపాలిటీకి సిల్వర్ అవార్డు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలు ఉండగా.. భీమవరానికి ఈ సిల్వర్ అవార్డు వచ్చింది. మున్సిపల్ కార్పొరేషన్ లో తిరుపతికి గోల్డ్ అవార్డు, భీమవరం మున్సిపాలిటీకి సిల్వర్ అవార్డు ప్రకటించారు. విద్యుత్ వినియోగం, ఆదా చేయడంతో ఈ గౌరవం దక్కింది. ఈ అవార్డు రావడానికి సహకరించిన అధికారులు, నాయకులకు, ప్రజలకు కమిషనర్ రామచంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.