ఖమ్మం జిల్లా సబ్ జైల్ ప్రాంగణంలో తేనెటీగల పెంపకం యూనిట్‌ను జైల్ల శాఖ డిజి డాక్టర్ సౌమ్య మిశ్రా ప్రారంభించారు. తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో మొత్తం నాలుగు తేనెటీగల పెంపకం యూనిట్లు ప్రారంభించామని.. ఇక్కడ తయారయ్యే తేనె చాలా నాణ్యతతో ఉంటుందని సౌమ్య మిశ్రై తెలిపారు. తేనెటీగల పెంపకం ఖైదీలు స్కిల్ డెవలప్మెంట్ గా ఉపయోగపడుతుందని అన్నారు. ఖైదీలు జైలు నుంచి విడుదలైన తర్వాత యూనిట్‌ను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.