కర్ణాటకలోని శివనసముద్రంలో శనివారం రాత్రి నీరు తాగేందుకు కాలువలోకి దిగిన ఏనుగు.. అందులోనే చిక్కుకుంది. కాలువ 60 అడుగుల లోతు ఉండటంతో అందులో నుంచి బయటకు రాలేకపోయింది. దీంతో రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్.. ఏనుగుకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి, భారీ హైడ్రాలిక్ క్రేన్ సహాయంతో సురక్షితంగా బయటకు తీశారు. ఏనుగు అడవిలోకి నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాన్ని సోషల్ మీడియాలో IFO పర్వీన్ కస్వాన్ పంచుకున్నారు.