సూర్యాపేట పట్టణంలోని ఏవీఎం క్రిస్టియన్ మైనారిటీ పాఠశాలలో మత వివక్ష ఆరోపణలతో వివాదం చెలరేగింది. రత్నావత్ మహేష్ అనే తొమ్మిదో తరగతి విద్యార్థి నాలుగు రోజుల క్రితం అయ్యప్ప మాల ధరించి పాఠశాలకు రావడంతో హెడ్మాస్టర్ అభ్యంతరం వ్యక్తం చేసి కొట్టిందని విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. విద్యార్థిని మందలించడమే కాకుండా దాడికి పాల్పడి, బయటకు పంపించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విద్యార్ధిని మందలించడంపై అయ్యప్ప మాలధారులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. క్రిస్టియన్ స్కూల్ కావడంతో హిందూ ధర్మాన్ని అవమానపరుస్తున్నారంటూ భక్తులు విమర్శించారు. అయ్యప్ప మాలధారణ పై అభ్యంతరం వ్యక్తం చేసిన యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.