రోడ్డు భద్రతపై అవగాహనలో భాగంగా, కిమ్స్ సన్షైన్ ఆసుపత్రి ఛైర్మన్ డా.గురువారెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బుధవారం రసూల్పుర వద్ద యమధర్మరాజు వేషధారణలో ఉన్న వ్యక్తి చేత వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై కీలక సూచనలు చేయించారు. ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే ప్రాణాలు కోల్పోతారని, కొత్త తరహా విధానంతో ప్రజల్లో మరింత అవగాహన పెంచవచ్చని ఆయన తెలిపారు.