ఆస్ట్రేలియాలోని సిడ్నీలో యూదులపై ఉగ్ర దాడి ఘటన యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఈ దాడి సమయంలో ఉగ్రవాదులకు ఎదురెళ్లి గాయపడిన అహ్మద్ అల్ అహ్మద్ అనే వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో అహ్మద్‌ను ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనెస్ పరామర్శించారు. అహ్మద్.. నువ్వు హీరోవి. ఉగ్రవాదుల నుంచి ప్రజలను కాపాడేందుకు నీ ప్రాణాలను పణంగా పెట్టావు. ప్రతి ఆస్ట్రేలియన్ తరఫున నీకు ధన్యవాదాలు’’అని తెలిపారు.