వరంగల్ భూపాలపల్లి నేషనల్ హైవే కొత్తగట్టు దగ్గర శాయంపేట పోలీసులు త్రీడీ కార్, పోలీసు స్టాచ్యూ ఏర్పాటు చేశారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో ఈ 3డీ.. యానిమేటెడ్ పెట్రో కార్, బ్లూ కోల్ట్ కానిస్టేబుల్‌తో ఉన్న స్టాచ్యూ ఏర్పాటు చేశామని.. ప్రమాదాల నివారణకు, రాత్రి సమయాల్లో కూడా కనపడే విధంగా రేడియం స్టికర్స్ ఏర్పాటు చేసినట్టు పరకాల ఏసీపీ సతీష్ బాబు తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ప్రమాదాల నివారణలో సహకారం అందించాలని కోరారు.