శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండలో.. సూరత్ నుంచి బెంగళూరుకు హవాలా డబ్బు తరలిస్తున్న ముఠాను దుండగులు అడ్డుకున్నారు. హవాలా డబ్బు తరలిస్తున్న ఇన్నోవా కారును నాలుగు కార్లలో వెంబడించిన దుండగులు.. పెనుకొండ దగ్గర కారును అడ్డగించి.. సూరత్ నుంచి వచ్చిన వ్యక్తులను కిడ్నాప్ చేశారు. అనంతరం కారును ఓ చోట ఆపి.. మూడు కోట్ల రూపాయలను దోచుకెళ్లారు. అయితే కారును అడ్డగించిన దృశ్యాలతో పాటు కిడ్నాప్ చేసిన వ్యవహారం.. బెంగళూరు జాతీయ రహదారిపై వస్తున్న మరో కారు డాష్ కామ్‌లో రికార్డ్ అయ్యాయి. పెనుకొండ చెక్‌పోస్ట్ దగ్గరున్న సీఐకి ఈ కిడ్నాప్ వ్యవహారంపై కారు ఓనర్ సమాచారం ఇచ్చాడు. ఈ సమాచారంతో పోలీసులు తనిఖీలు చేయగా అసలు విషయం బయటపడింది.