హిందువులు అత్యంత పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాలుగా భావించేవాటిలో ఒకటైన కేదార్నాథ్ క్షేత్రం ఇవాల్టి నుంచి భక్తులకు అందుబాటులో ఉండనుంది. అంగరంగ వైభవంగా ఆలయాన్ని అలంకరించి, పురోహితులు తలుపులు తెరిచారు. ఈ సందర్భంగా ఆర్మీ బ్యాండ్ ఆలయం వెలుపల నిర్వహించిన ప్రదర్శన ఆకట్టుకుంటోంది. జవాన్లు కేదార్నాథ్ బాబు కోసం మనోహరమైన సంగీతాన్ని ప్లే చేశారంటూ IAS అలోక్ కుమార్ దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు.