ఏపీ ప్రభుత్వానికి సోనూసూద్ ఫౌండేషన్ నాలుగు అంబులెన్స్‌లను అందించింది. ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ.. తెలుగు ప్రజలు తనకు అత్యంత ఆప్తులన్న ఆయన.. వారికి ఏదైనా చేయటం తన బాధ్యతగా భావిస్తానని తెలిపారు. ఏపీ తనకు రెండో ఇళ్లు లాంటిదని చెప్పారు. తన సతీమణి కూడా ఆంధ్రాకు చెందినవారే అని తెలిపారు. తనకు ఎలాంటి రాజకీయపరమైన ఆశలు లేవని సోనూసుద్ స్పష్టం చేశారు