ప్రముఖ వాయిద్య కళాకారిణి అనుష్కా శంకర్, ఎయిర్ ఇండియా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విమాన ప్రయాణంలో రవాణా సమయంలో తన సితార్‌ను ఎయిర్‌లైన్స్ సిబ్బంది విరగ్గొట్టారని ఆరోపిస్తూ ఆమె ఒక వీడియోను విడుదల చేశారు. విలువైన సంగీత పరికరాన్ని నిర్లక్ష్యంగా ధ్వంసం చేయడంపై అనుష్క మండిపడ్డారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా వ్యవహరించిన తీరును నెటిజన్లు కూడా ప్రశ్నిస్తూ, విమర్శిస్తున్నారు.