కర్నూలు కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ధర్నా చేపట్టారు. తమకు కనీస వేతనం 26వేలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అలాగే పనిభారం తగ్గించడానికి అన్ని యాప్లను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చకపోతే ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లలిత, ఐద్వా నాయకురాలు నిర్మలమ్మ హెచ్చరించారు.