శంషాబాద్ మున్సిపాలిటీలోని కల్లు కాంపౌండ్లో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. కంత్రమోని లక్ష్మీమమ్మ తన ఇద్దరు పిల్లలతో కల్లు తాగుతుండగా.. గుర్తుతెలియని మహిళ లక్షీమమ్మ కూతురు కీర్తన(6)ను మాటలతో మభ్యపెట్టి కిడ్నాప్ చేసింది. తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితురాలి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.