మేడ్చల్ జిల్లా ఉప్పల్ భగాయత్ HMDA లేఅవుట్లోని ‘లిమ్రా’ పరుపుల షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వాటర్ ట్యాంకుకు కనెక్షన్ ఇచ్చే క్రమంలో వైరు స్పాంజిపై పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి, సుమారు రూ.25 లక్షల ఆస్తి నష్టం జరిగింది. రెండు రోజుల్లో ప్రారంభించాల్సిన షాపు ఇలా కాలిపోవడంపై యజమాని ఖదీర్ ఆవేదన వ్యక్తం చేశారు.