పుణే లోకల్ బాడీ ఎన్నికల గెలుపు సంబరాల్లో భాగంగా కార్యకర్తలు విజేతలపై ఓ భవనంపై నుంచి పసుపు చల్లారు. పక్కనే ఉన్న దీపంపై అది పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో విజేతలతో పాటు పలువురు గాయపడ్డారు. సాధారణంగా పసుపు చిన్న మొత్తంలో ఉంటే పెద్ద ప్రమాదమేమీ ఉండదు. కానీ, ఫైన్ పౌడర్ పెద్ద మొత్తంలో మంటలకు దగ్గరగా వెళితే మాత్రం ముప్పు తప్పదు.