అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన F-16C ఫైటర్ జెట్ దక్షిణ కాలిఫోర్నియాలోని ఎడారిలో కుప్పకూలింది. ట్రోనా ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరగడానికి ముందే పైలట్ పారాచూట్ సహాయంతో సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలైన అతడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. శిక్షణలో భాగంగా ఈ విమానం కూలిపోయిందని, దీనికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.