కొన్నేళ్లుగా అవినీతి నిరోధక శాఖ పేరిట వసూళ్లకు పాల్పడుతున్న ముఠా అల్వాల్ పోలీసులకు చిక్కినట్లే చిక్కి పరారైంది. వారు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. బొల్లారం రైల్వే స్టేషన్ సమీపంలోని రాత్రి సమయంలో పోలీసులు తనిఖీలు చేస్తున్న క్రమంలో అవినీతి నిరోధక శాఖ పేరుతో ఉన్న కారులో కొంతమంది అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులు కారును ఆపి డ్రైవర్ ను ప్రశ్నించగా.. అవినీతి నిరోధక శాఖ అధికారులు అని చెప్పాడు. కారులో ఉన్న జి ఆర్ శ్రీకాంత్ అనే వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ వ్యక్తిని విచారించిన అల్వాల్ పోలీసులకు తాను అవినీతి నిరోధక శాఖ సికింద్రాబాద్కు చెందిన అధికారినని చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులకు పట్టుకుందామనుకునే లోపే.. కారులో నుంచి దిగి పరారయ్యారు.