ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హకు ఓ గొప్ప సందేహం వచ్చింది. ఇటీవల మంచు లక్ష్మీ వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సందేహాన్ని అర్హ తీర్చేసుకుంది. మంచు లక్ష్మీ. అర్హను ఉద్దేశించి... నువ్వు నన్నేదో అడగాలని అనుకున్నావట కదా... ఏంటది అని అడిగింది. నువ్వు తెలుగేనా అనే సందేహాన్ని అల్లు అర్హ... మంచు లక్ష్మీ ముందు పెట్టింది. దాంతో కాస్తంత కన్ ఫ్యూజన్ కు గురైన లక్ష్మీ అదేమిటీ నేనే నీతో మాట్లాడుతోంది తెలుగులోనే కదా... నీకెందుకు ఆ సందేహం కలిగిందని ఎదురు ప్రశ్నించింది. ఏం లేదు... నీ ఆక్సెంట్ అలా అనిస్తోందని నవ్వుతూ బదులిచ్చింది అర్హ. నీది కూడా అలాగే ఉంటుంది కదా' అని నవ్వేస్తూ అర్హా తలపై ముద్దుపెట్టేసింది మంచు లక్ష్మీ