పల్నాడు జిల్లా నరసరావుపేటలో 4వ రోజు అఖిల భారత ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన పోటీలు జరిగాయి. ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఏపీ ప్రభు్వ విప్ జీవి ఆంజనేయులు హాజరయ్యారు. ఇక్కడ జరుగుతున్న ఎడ్ల పోటీలను చూస్తే సినిమా చూసినట్టుగా అనిపించిందని.. మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి అన్నారు. అంతరించి పోయిందనుకున్న ఎడ్ల పోటీలు, మళ్ళీ మొదలు పెడితే ఎంతో సంతోషంగా ఉందన్నారు.