కాకినాడ జిల్లా పిఠాపురంలో నకిలీ నెయ్యి ఆరోపణలు కలకలం రేపాయి. 9వ వార్డులో మాధవ నగర్లో ఓ ఇంట్లో పశువుల కొవ్వుతో కల్తీ నెయ్యి తయారీ చేస్తున్నట్టు సమాచారం రావడంతో విశ్వ హైందవ పరిషత్ అధ్యక్షులు దువ్వా వెంకటేశ్వరావు ఇచ్చిన సమాచారం రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. అది నెయ్యి కాదని, కార్తీక మాసం సందర్భంగా దీపారాధనకు వినియోగించేందుకు నూనె తయారు చేస్తున్నట్లు అధికారులకు నిర్వాహకులు తెలిపారు. గతంలో కూడా కొవ్వుతో కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారని వచ్చిన ఆరోపణలపై రెవెన్యూ, మున్సిపల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి.. శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపిచారు. అయితే పశు వ్యర్ధాలతో కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారని ఫిర్యాదు చేసినా.. మున్సిపల్ కమిషనర్ పట్టించుకోవడం లేదని విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఆరోపిస్తున్నారు.