ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులను చలి వణికిస్తోంది. రోజురోజుకూ పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతల కారణంగా జిల్లా వ్యాప్తంగా మంచు కమ్మేసింది. చలికి తోడు ఈదురుగాలులు జిల్లా వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సింగిల్ డిజిట్‌కు కనిష్ఠ ఉష్ణోగ్రతలు చేరుకోవడంతో జనం చలికి వణుకుతున్నారు. దీంతో ఏజెన్సీలో చలిమంటలు దర్శనమిస్తున్నాయి. ఇక కొమురంభీం జిల్లా సిర్పూర్ లో 8.7 కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి పగలు అనే తేడా లేకుండా స్వెట్టర్లు వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.