షాద్ నగర్ లోని ప్రధాన రహదారిని వెంటనే విస్తరించాలని డిమాండ్ చేస్తూ రాజు అనే యువకుడు వినూత్న రీతిలో నిరసనకు దిగాడు. హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉండి, రోజురోజుకూ ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్నా, నేటికీ రోడ్డు విస్తరణ పనులు జరగకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో, విధిలేక అర్ధనగ్నంగా రోడ్డుపై నిరసన తెలుపుతున్నట్లు రాజు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన రోడ్డు విస్తరణ పనులు చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.