ఉపాధి కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన అనంతపురం జిల్లా కొవ్వూరు వాండ్లపల్లికి చెందిన రామచంద్ర అనే యువకుడు అదృశ్యమయ్యాడు. ఏడాది క్రితం దక్షిణాఫ్రికా దేశంలో బోర్ వెల్స్ లో పనిచేసేందుకు వెళ్లాడు. ఈ ఏడాది అక్టోబర్ లో ఇండియాకు తిరిగి వస్తానని కుటుంబ సభ్యులకు యువకుడు తెలిపాడు. కంపెనీ యాజమాన్యం సెలవు ఇవ్వకపోవడంతో అక్కడే ఉండిపోయాడు. నవంబర్ 22వ తేదీన కుటుంబ సభ్యులతో మాట్లాడిన యువకుడు రామచంద్ర తర్వాత ఫోన్లో అందుబాటులో లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఇదే విషయంపై కుటుంబ సభ్యులు కంపెనీ యాజమాన్యంతో సంప్రదించగా మీ అబ్బాయి రామచంద్రను నవంబర్ 23న నక్సల్స్ కిడ్నాప్ చేశారని సమాచారమిచ్చారు. తన బిడ్డ క్షేమంగా ఉన్నాడా తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.